24 C
Hyderabad
Sunday, August 2, 2026

డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ నియోజకవర్గం రూరల్ మండలంలోని  ఖానాపూర్ శివారులో గల న్యూ కలెక్టరేట్ పక్కన ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను, కూరగాయల మార్కెట్ అయినా గాంధీ గంజ్ ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ లో  గత ప్రభుత్వంలో నిర్మించి వాటిని  ఉపయోగం లోకి తీసుకు రాలేదని, వాటికి వెచ్చించిన డబ్బులన్నీ వృధా చేశారని  అన్నారు. ప్రస్తుతం ప్రజాపాలనలో  నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు  ఇస్తున్నామని అన్నారు. నిజాంబాద్ డివిజన్ 1 ఖానాపూర్ లో గల ఉన్న డబుల్ బెడ్ రూంలు రెండో విడతలో  ఇండ్ల స్థలాలు లేనివారికి   ఖానాపూర్, కాలూర్ లబ్ధిదారులకు కేటాయించాలని ఉద్దేశంతో  పరిశీలించడం జరిగిందని అన్నారు. అలాగే గాంధీ గంజ్ లోని దుర్గామాత ఆలయంలో దర్శించుకోవడం జరిగింది. అనంతరం   కూరగాయల మార్కెట్ కబ్జాకు గురి అవుతుందని విషయం తెలుసుకున్న తర్వాత  మార్కెట్ మ్యాపు చూసి  అక్కడి పరిస్థితులను  పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, మాజీ ఐసిడిఎంఎస్  చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, డిసిసి డెలికేట్ ధర్మ గౌడ్, కాంగ్రెస్ నాయకులు వాసు బాబు, సాంసన్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article