డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ నియోజకవర్గం రూరల్ మండలంలోని ఖానాపూర్ శివారులో గల న్యూ కలెక్టరేట్ పక్కన ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను, కూరగాయల మార్కెట్ అయినా గాంధీ గంజ్ ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ లో గత ప్రభుత్వంలో నిర్మించి వాటిని ఉపయోగం లోకి తీసుకు రాలేదని, వాటికి వెచ్చించిన డబ్బులన్నీ వృధా చేశారని అన్నారు. ప్రస్తుతం ప్రజాపాలనలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని అన్నారు. నిజాంబాద్ డివిజన్ 1...