27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంను కలిసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  హైదరాబాదులో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి  కలిశారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన వరద నష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి  వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి తో  నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలో  గత రెండు రోజులుగా  కురిసిన వర్షం వల్ల పంటలు, రోడ్లు, విద్యుత్, కరెంటు స్తంభాలు, బ్రిడ్జ్ లు  ఎంత నష్టం జరిగిందో  సీఎంకు వివరించడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్ల భవనాలు శాఖ లు సమన్వయంతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలో ఎంత  వరద  నష్టం జరిగిందో  అంచనా వేసి  సీఎంకు పంపాలని  ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు  జారీ చేశారని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం, రోడ్లు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫర్  లు ధ్వంసం గురించి  సీఎంకు వివరించారు. సిఎం సానుకూలంగా స్పందించి  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు  అన్ని శాఖల సమన్వయంతో వరద వల్ల  పూర్తి నష్టాన్ని  అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. హైదరాబాదులో సోమవారం రోజు సీఎం జిల్లాలో జరిగిన వరద నష్టం పై  కలెక్టర్లతో రివ్యూ చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  తెలిపారు.

More articles

Latest article