రెవెన్యూ భూమి కబ్జాను అడ్డుకున్న రుద్రూర్ తహసీల్దార్

0 14,563
  • రెవెన్యూ భూమి కబ్జాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం…
  • రుద్రూర్ తహసిల్దార్ సురేందర్ నాయక్

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రెవిన్యూ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జాకు పాల్పడుతుండగా ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలనకు సోమవారం అక్బర్ నగర్ గ్రామానికి వచ్చిన తహసిల్దార్ సురేందర్ నాయక్ అడ్డుకున్నారు. గుట్ట ప్రాంతాన్ని చదును చేసి కాలువని పూడ్చివేయడంతో సదరు వ్యక్తిపై, జెసిబి డ్రైవర్ పై తహసిల్దార్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇది రెవెన్యూ భూమి అని ఎవరు కబ్జాలకు పాల్పడిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జెసిబితో కబ్జా చేస్తున్న వ్యక్తికి నోటీసులు జారీ చేయాలని అట్టి స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని కారోబార్ లక్ష్మణ్ కు తహసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు. తన అనుమతి లేనిదే అక్బర్ నగర్ రెవెన్యూ స్థలాల్లో జెసిబి, ఇతర యంత్రాలతో ఎటువంటి పనులు జరిపిన చట్టరీత్యా కట్టిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని జెసిబి డ్రైవర్ పై తహసిల్దార్ ఆగ్రహన్ని వ్యక్తపరిచారు. సదరు భూమి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన కభరస్థాన్ అని రెండు నెలల క్రితం మజీద్ కమిటీ సభ్యులు రుద్రూర్ గత తహసిల్దార్ తారాబాయికి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యదేచ్ఛగా జెసిబి సహాయంతో గుట్ట ప్రాంతాన్ని చదును చేస్తూ వరద కాలువను సైతం మూసివేసి కబ్జాకు పాల్పడ్డారు.

Rudrur Tahsildar prevents seizure of revenue land

Leave A Reply

Your email address will not be published.