రెవెన్యూ భూమి కబ్జాను అడ్డుకున్న రుద్రూర్ తహసీల్దార్
రెవెన్యూ భూమి కబ్జాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం... రుద్రూర్ తహసిల్దార్ సురేందర్ నాయక్ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రెవిన్యూ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జాకు పాల్పడుతుండగా ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలనకు సోమవారం అక్బర్ నగర్ గ్రామానికి వచ్చిన తహసిల్దార్ సురేందర్ నాయక్ అడ్డుకున్నారు. గుట్ట ప్రాంతాన్ని చదును చేసి కాలువని పూడ్చివేయడంతో సదరు వ్యక్తిపై, జెసిబి డ్రైవర్ పై తహసిల్దార్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇది రెవెన్యూ భూమి అని ఎవరు...