31.2 C
Hyderabad

ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలో  ఓబీసీ మోర్చ కన్వీనర్ నాగం సాయిలు ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ సందర్బంగా నాగం సాయిలు మాట్లాడుతూ… మన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ 11 సంవత్సరాల్లో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని కిసాన్ సమ్మన్ నిధి యోజన ద్వారా 6000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడికి ఇవ్వడంతో పాటు ఎరువుల పైన సబ్సిడీ ఇచ్చి రైతులు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర కల్పించడంతో  రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల అధ్యక్షులు కల్లూరి హనుమాండ్లు(భజరంగ్), సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, శంకర్, వెంకట్, రామ్ పటేల్, రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article