23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్టీసీ హమాలి కార్మికుల ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల  సంతాపంగా నిజామాబాద్    ఆర్టీసీ హమాలీ సంఘం కార్మికులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు.  గత రెండు దశాబ్దాల క్రితం భారతదేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన  మహోన్నతమైన దేశ ప్రధానిగా చిరస్థాయిగా నిలిచిపోతారని  ఈ సందర్భంగా  కార్మికులు గుర్తు చేసుకున్నారు.  ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు రైతులకు   కార్మికుల అన్ని రంగాల శ్రామిక వర్గానికి  చెందిన ప్రజల  జీవన విధానంలో ఆయన ఎల్లప్పుడూ   జీవించే ఉంటారని అన్నారు.  ఈ కార్యక్రమంలో కార్మిక శక్తి సంపాదకులు రాపల్లి శ్రీనివాస్, హమాలి సంఘం అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ,డి ఎస్ ఎస్   నాయకులు మంగోలు ఎల్లయ్య ,హమాలి  సంఘం నాయకులు  ఎం గంగాధర్, రామేసిన పల్లి శ్రీనివాస్, గాదం నరేష్, తోపిక్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article