- ఎమ్మెల్యే మదన్ వినతికి స్పందించిన రవాణా శాఖ మంత్రి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతిపత్రం అందజేయగా కొత్తగా 10 ఆర్టీసీ బస్సులు మంజూరు అయ్యాయి. ఇటీవల 5 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బస్ స్టాండ్‌ను నిర్మించి ప్రజల వినియోగానికి అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో ప్రజా రవాణా సౌకర్యాలను విస్తరించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. ఈ సందర్భంగా బస్సుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే స్పందించి బాన్సువాడ, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఎల్లారెడ్డికి అదనపు కొత్త బస్సులను కేటాయించారు. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గానికి కొత్త బస్సులు రానున్నాయి. మూడు దశాబ్దాల క్రితం డిపో నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో బస్ డిపో ఏర్పాటు ఎల్లారెడ్డి ప్రజల ఎన్నో ఏళ్ల కల. అవసరమైన అన్ని అనుమతులు సిద్ధంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతిపత్రం అందజేయగా వారు సానుకూలంగా స్పందించారు. అర్టిసీ ఎండి కి ఎల్లారెడ్డిలో బస్ డిపో నిర్మాణంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

