బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని పత్తి కాంతయ్య(59) బుధవారం ఉదయం కాల కృత్యాలకు వెళ్లి మారేడు చెరువులో కాలుజారి పడి చనిపోయాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేసుకుని పంచనామ నిర్వహించారు.ఎస్సై రాజు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ కాంతయ్య కాలకుత్యాలకు వెళ్లి ప్రమాదవశత్తు కాలుజారి చెరువులో పడి చనిపోయారని తెలిపారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
