24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల మహిళా సమాఖ్య పేరుతో ఆర్టీసీ బస్సు రిజిస్ట్రేషన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బస్సు కేటాయింపు

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల మహిళా సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ బస్సుకు అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. జహీరాబాద్ డిపోకు చెందిన ఈ బస్సును ఏర్గట్ల మండల మహిళా సమాఖ్య పేరుతో హైపోతికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం సంగారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సును కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అతి చిన్న మండలాల్లో ఒకటైన ఏర్గట్లకు కూడా బస్సు కేటాయించారని, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్టీసీ అధికారులు, మండల మహిళా సమాఖ్య ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ బస్సు ద్వారా మండల మహిళా సమాఖ్యకు ప్రతినెల రూ.69,148 చొప్పున 82 నెలల పాటు ఆదాయం లభించనుందని, మొత్తంగా సుమారు రూ.56 లక్షల ఆదాయం సమాఖ్యకు సమకూరనున్నట్లు గంగాధర్ తెలిపారు. ఈ ఆదాయం మహిళా సంఘాల అభివృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల మహిళా సమాఖ్య పాలకవర్గం, 4 వేల మంది మహిళా సంఘ సభ్యులు, సిబ్బంది తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కే. లక్ష్మి, కార్యదర్శి బి. సునీత, సీనియర్ సీసీ రవి కుమార్, ఎంఎస్ఏ సుప్రియతో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article