స్మారక చిహ్నం, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వెబ్ న్యూస్, బతుకమ్మ : సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద ఆదివారం అంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను వారు ఓదార్చారు. వారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున రూ.50 లక్షల ఆర్థిక సాయ ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం, ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మురళీనాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
