26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మరణించిన హోమ్ గార్డ్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బ్యాంకు ఖాతాలో జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

విధి నిర్వహణలో సేవలందించి మరణించిన హోమ్ గార్డ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయింది. కామారెడ్డి జిల్లా హోమ్ గార్డ్స్ సంస్థకు చెందిన హోమ్ గార్డ్ నెం.247 జి. శ్రీనివాస్ గత సంవత్సరం మృతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా సాయాన్ని ఆయన సతీమణి రేఖ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా రేఖ జిల్లా పోలీసు అధికారి యం.రాజేష్ చంద్ర ను మర్యాదపూర్వకంగా కలిసి, తమ కుటుంబానికి ఎక్స్‌ గ్రేషియా అందేలా చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ, హోమ్ గార్డ్స్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో సేవలందించే హోమ్ గార్డుల కుటుంబాల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. మరణించిన హోమ్ గార్డుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోలీసు శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించిన ఎస్పీ, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమ్ గార్డుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోమ్ గార్డుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.

More articles

Latest article