24.2 C
Hyderabad

గద్దర్‌ ఫౌండేషన్‌కు రూ.3కోట్లు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌

 

గద్దర్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ జయేశ్‌ రంజన్‌ ఈ ఉత్వర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక  రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్‌ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జయంతి వేడుకల నిర్వహణలోనూ గద్దర్‌ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్వర్వుల జారీ చేసింది. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసకెళ్లేందుకు ఏర్పాటైన ఈ ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టానున్నారు.

More articles

Latest article