. నూతన టూరిజం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి బడ్జెట్ సమావేశాల్లో నూతన పాలసీని ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక రంగం వాటాను 10శాతం పెంచింది. రూ.15వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 3లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 20230 నాటికి రూ.10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. నూతన పాలసీలో భాగంగా రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటురాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), సమీపంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. గోదావరి, కృష్ణా నదులపై జెట్టీలు, లాంచి స్టేషన్లు, వాటర్ స్పోర్ట్స్ , హౌస్ బోట్లు, నదీ ఉత్సవాలను ప్రోత్సహిస్తూ, పర్యాటక రంగంలో పెట్టుబడులకు మూలధన సబ్సిడీలు, భూమి వినియోగ మార్పిడికి సంబంధించిన రాయితీలు ఇవ్వనున్నారు. పర్యాటక శాఖకు బడ్జెట్ లో రూ.775 కోట్లు కేటాయించనున్నట్లు ప్రతిపాదించారు.
పర్యాటకంలో రూ.15వేల కోట్లు
