27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అట్ట పెట్టల్లో రూ.11 కోట్ల నోట్లు

Must read

📰 Generate e-Paper Clip

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌లో సిట్ అధికారుల తనిఖీలు

నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు

హైదరాబాద్, బతుకమ్మ: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని రాజ్ కసిరెడ్డికి చెందిన సులోచన ఫాంహౌస్‌పై రైడ్స్ చేశారు. తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదును సిట్ అధికారులు  సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. 12  అట్ట పెట్టల్లో భారీగా నగదును ఏపీ సిట్ అధికారులు గుర్తించారు. 2024 జూన్‌లో ఈ డబ్బులు దాచిపెట్టినట్లు సిట్ అధికారులు తెలిపారు. సులోచన ఫాంహౌస్ ప్రొ. బాల్‌రెడ్డి పేరు మీద ఉంది. లిక్కర్ స్కామ్ ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణిక్యలు ఆ డబ్బు దాచిపెట్టినట్లు సిట్ విచారణలో తేలింది.

Rs. 11 crore notes in boxes

More articles

Latest article