- బీజేపీ మండల అధ్యక్షుడు శేట్పల్లి విష్ణు
బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపి మండల అధ్యక్షుడు శేట్పల్లి విష్ణు అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఖాళీ కుర్చీకి పత్రం అందించారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రెండుసార్లు శంకుస్థాపన చేసి అట్టహాసంగా రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేయకుండానే నిలిపివేశారని అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పనులు సాగడం లేదన్నారు. దాంతో పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారీ వాహనాలే కాకుండా బైకులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనికి తోడు రోడ్డు మధ్యలో డస్ట్ పోయడం వలన పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో రహదారి బురద మయంగా మారి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. వెంటనే సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని, లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల జనరల్ సెక్రెటరీ జాదవ్ పండరి, మండల ప్రబారి శివాజీ పటేల్, మండల ఉపాధ్యక్షులు హట్కరి గణపతి, ధర్మానాయక్, బిజెపి సీనియర్ నాయకులు మల్లికార్జున్ దేశాయ్, మొగులు గొండ తదితరులు పాల్గొన్నారు.
