భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే …హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని అదే దారిలో వెళ్తున్న మరో లారీ ఢీకొంది. తీవ్ర గాయాలైన క్లీనర్ తంగావెల్, డ్రైవర్ మణి ని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా కొద్దిసేపు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి.

