హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం

0 8,675

 

. . . ఆరుగురు సిరిసిల్ల వాసుల మృతి

 

. . . రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదం విషయం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీ కి తెలియడంతో బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలియడంతో బొల్లి రాంమోహన్ బోరున విలపించారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలివెళ్లారు. రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నేత రాంమోహన్ సొదరుని కుటుంబ సభ్యులు మృతి చెందిన విషయం తెలియగానే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. శంషాబాద్ ఏసీపి నాగభూషణం ను వివరాలు అడిగి తెలిసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. సిరిసిల్ల వాసులు మృతి పట్ల కేటీఆర్ దిగ్బాంతిని వ్యక్తం చేసారు.

 

Road accident at ORR in Hyderabad

Leave A Reply

Your email address will not be published.