27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్ కెఆర్ అపార్ట్ మెంట్ వాసుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

  •  అపార్ట్ మెంట్ రోడ్డును కబ్జా చేయాలని చూస్తున్నారు
  •  బీఆర్ఎస్ అగ్రనేత అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఆర్ కెఆర్ అపార్ట్ మెంట్ లో నాలుగేళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్న వారికి తమ అపార్ట్ మెంట్ అవుట్ గేట్ స్థలంను కొందరు కబ్జా చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. సోమవారం రాత్రి అపార్ట్ మెంట్ ఎంట్రీ వద్ద స్థలాన్ని కబ్జాకు యత్నించగా మంగళవారం రాత్రి ఏకంగా టిప్పర్ కంకరతో అక్రమ నిర్మాణానికి ప్రయత్నించారు. విషయం తెల్సిన అపార్ట్ మెంట్ వాసులు కబ్జాదారులు వాగ్వివాదానికి దిగారు. తమను బీఆర్ ఎస్ నేత ఆర్ కెఆర్ అనుచరులుగా చెప్పుకుంటున్న వారు కబ్జా చేసేందుకు యత్నించడంపై మండిపడ్డారు. 4 సంవత్సరాలుగా  అపార్ట్ మెంట్ నుంచి రాకపోకలు చేస్తుంటే తమను అపార్ట్ మెంట్ లోకి  ప్రవేశించకుండా కబ్జా చేయడం ఏంటని వారితో వాగ్వివాదానికి దిగారు. తమపై బీఆర్ఎస్ నేత అనుచరులు దాడి చేశారని దుర్భాషలాడారని మండిపడ్డారు. నేరుగా వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ రోడ్డుకు సంబంధించి కబ్జా విషయం పై ఫిర్యాదు వాస్తవమేనని పోలీసులు తెలిపారు.

RKR apartment residents protest

More articles

Latest article