29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా భగవద్గీత జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూరు పట్టణం లోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో బుదవారం రోజున గీత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .భగవద్గీత యొక్క సారాంశం పిల్లలకు తెలియజేస్తూ ప్రతి అధ్యాయం లోని విషయాలను తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ “గీ”అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది.”త” అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశిస్తుంది. భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది.దాయాధులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు.భగవద్గీత లోని మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క “యోగము” అని చెబుతారు. వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి “కర్మషట్కము”అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను “భక్తి షట్కము”అని అంటారు.13 నుండి 18 వరకు “జ్ఞాన షట్కము”అంటారు. ప్రథమాధ్యాయంలో అర్జునుని విషాద యోగం ఉంది. ద్వితీయా ధ్యాయంలో సాంఖ్య యోగం, తృతీయలో కర్మయోగము, చతుర్థలో జ్ఞాన యోగము, పంచమలో కర్మ సన్యాసయోగము, షష్ఠలో ఆత్మ సంయమ యోగము, సప్తమలో జ్ఞాన విజ్ఞానయోగం, అష్టమలో అక్షర పరబ్రహ్మ యోగము, నవమలో రాజ విద్యా రాజ గుహ్య యోగము, దశమలో విభూతి యోగము, ఏకాదశలో విశ్వరూప సందర్శన యోగము, ద్వాదశలో భక్తి యోగము, త్రయోదశలో క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము, పంచదశలో పురుషోత్తమ ప్రాప్తియోగము, షోడశలో దైవాసుర సంపద్విభాగ యోగము, సప్తదశలో శ్రద్ధా త్రయ విభాగయోగము, అష్టదశలో మోక్ష సన్యాస యోగ విషయాలు ఉన్నాయి. భగవద్గీత అర్జునుడు, యువరాజు మరియు భగవంతుని స్వరూపుడైన కృష్ణుని మధ్య సంభాషణగా అందించబడింది.

Bhagavad Gita Jayanti Celebrations

More articles

Latest article