. . . నష్టపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఠాణంపల్లి క్యాంపు గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షానికి సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన అకాల వర్షానికి వరి పంట తీవ్రంగా నష్టపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు. బుధవారం నష్టపోయిన పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి, రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షానికి చేతికొచ్చిన వరి పంటలు నష్టపోవడం జరిగిందన్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, కొత్తపల్లి రవికిరణ్, శేఖర్, బొట్టే గజేందర్, సతీష్ తదితరులు ఉన్నారు.