… బీజేపీ జిల్లా అధ్యక్షులు, దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
సీఎం రేవంత్ రెడ్డి ఒక వర్గం ఓట్ల కోసమే హిందూ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలనిబీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాదు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూగతంలో కెసిఆర్ హిందూ గాళ్ళు బొందుగాళ్ళు అంటే పాతాలానికి పాతేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కూడా అదే దుస్థితి పడుతుంది అన్నారు. ఇవన్నీ ఒక వర్గం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ నాటకమని తీవ్రంగా విమర్శించారు. ఒక వర్గం మన్ననలు పొందడానికి హిందువులను బాధించే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల సాంప్రదాయ మైపోయిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడటం చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితే వచ్చింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఆకుల శ్రీనివాస్, బూరుగుల వినోద్, ఇప్పకాయల కిషోర్,మల్లేష్ గుప్తా, గడ్డం రాజు, అంబదాస్ రావు, గిరిబాబు, యాదల నరేష్, ఆమందు విజయ్ కృష్ణ, ఆనంద్, చిరంజీవి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
