29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ భావజాలంపై రేవంత్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం సాధించి,పదేళ్ల ప్రగతిఫలాలు ప్రజలకు అందించిన కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కుట్రకేసులకు రేవంత్ రెడ్డి తెరతీస్తున్నారని నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న భారాసకు ,కేటీఆర్ కు కేసులు కొత్తేమి కాదని పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కు బ్రాండ్ ఇమేజిమి తీసుకువచ్చి,ఐటి రంగంలో తెలంగాణ ను దేశంలోనే శిఖరాగ్రానికి చేర్చిన కేటీఆర్ ను లక్ష్యం గా చేసుకుని సాగుతున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తోందని ఆయన అన్నారు. కుట్రకేసులను లీగల్ గా ఎదుర్కొని చేదిస్తామని అన్నారు.కేటీఆర్ పై కుట్రల కుత్రంతాలు చెల్లవని, తెలంగాణ ప్రజల మద్దతు తో తిప్పికొడతామని మధుసూదన్ తెలిపారు.

More articles

Latest article