నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అంగన్వాడి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననితెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, అంగన్వాడీ ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు అనురాధ,కార్యదర్శి లక్ష్మి,కార్యవర్గ సభ్యులు రేఖ,గీత తదితరులు పాల్గొన్నారు.
