27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని మిస్రిగల్లి, టీచర్స్ కాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, మదీనా కాలనీ, ఇస్లాంపుర, బండగల్లి ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలు లేక గర్భిణులు, బాలింతలు చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని.. అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ షేక్ అక్బర్, లాయక్, రహీం, అబ్దుల్ ఖాదర్, అంబర్ సింగ్, ఇర్ఫాన్ , అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article