27.5 C
Hyderabad
Friday, July 31, 2026

గణతంత్ర దినోత్సవం భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రెస్ క్లబ్ లో ఘనంగా 76 గణతంత్ర దినోత్సవ వేడుకలు .
  • పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం

 

నిజామాబాద్, బతుకమ్మ: గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందని, రాజ్యాంగానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని, రాజ్యాంగం ద్వారానే హక్కులు విధులు ఈనాడు ప్రతి ఒక్కరం పొందుతున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడుపుల రామ కృష్ణ, ప్రధాన కార్యదర్శి బైరీ శేఖర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Republic Day celebrates unity in diversity

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడుపుల రామ కృష్ణ, ప్రధాన కార్యదర్శి బైర శేఖర్ లు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం తో పాటు స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఎందరో త్యాగదనుల వల్ల స్వాతంత్ర్యం సిద్ధిస్తే, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన హక్కులు పొందుతున్నామన్నారు.భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్న శాంతియుతంగా కలసి మెలసి ఉంటున్నామని, గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందన్నారు.

Republic Day celebrates unity in diversity

 

 

ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి మన రాజ్యాంగం పునాది వేసిందన్నారు. ఈ రోజు మనం ఈ చారిత్రాత్మక రోజున భారతీయులమైన మనమందరం గర్వించాల్సిన విషయం అన్నారు. 76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన క్రికెట్, క్యారం, షటిల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు  ఐశ్వర్యం హోమ్స్ మధు చేతుల మీదుగా అందించారు. క్యారంలో కర్క రమేష్ (ప్రజా పక్షం), రాజు (నవ తెలంగాణ), ద్వితీయ బహుమతి సుభాష్ మనం-అంజనేయులు, షటిల్ లో శ్రీకాంత్ సిరిగాద ప్రసాద్, చేస్ లో శ్రీకాంత్ టి న్యూస్, క్రికెట్ ఇందూరు 11 జట్టులకు మొదటి బహుమతులు అందజేశారు. అనంతరం ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి, అర్గనైజర్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో  ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోవిందరాజు, కార్యనిర్వాక కార్యదర్శి మండే మోహన్, కోశాధికారి కొర్న సందీప్, కార్యవర్గ సభ్యులు ,నగర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Republic Day celebrates unity in diversity

More articles

Latest article