బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ చెరువులో చేప పిల్లలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోందని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖలేఖ్, మాజీ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం , బాన్స్ వాడ నియోజక వర్గ యువజన అధ్యక్షులు మధు సూదన్ రెడ్డి , హన్మాండ్లు , ఎంపీడీవో, సెక్రెటరీ మాజీ సర్పంచ్ రాజు, రామ్ రెడ్డి , వెంకట్ రెడ్డి , బోయసంగం నాయకులు పాల్గొన్నారు.

