25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జైళ్ల నుంచి విడుదలైన ఖైదీల కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్, బతుకమ్మ :  వివిధ నేరాలల్లో  జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించి  విడుదలైన ఖైదీల కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు అని  జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల కోసం  రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులను జైళ్ల శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో  జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఆమె సోమవారం ప్రారంభించారు.  జైలు శిక్షకు గురై సత్ప్రవర్తన కలిగిన పురుష ఖైదీలకు  పెట్రోల్ బంకుల్లో , మహిళా ఖైదీల కోసం కుట్టుమిషన్లు ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసినట్లు  ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని  ఆమె అన్నారు. కార్యక్రమంలో టీఎం రిటైల్ బీపీసీఎల్ శ్రావణ్ కుమార్, ఇన్ స్పె క్టర్ జనరల్ ఆఫ్ పర్సన్ వెల్ఫేర్ తెలంగాణ అధికారి మురళి బాబు, డిప్యూటీ ఇన్ స్పె క్టర్ జనరల్ పర్సన్ వరంగల్ రేంజ్ అధికారి సంపత్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఆనందరావు కూన తదితరులు పాల్గొన్నారు.

Rehabilitation and employment centers are for prisoners released from prisons.

 

 

More articles

Latest article