నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు డిపార్ట్ మెంట్ వాహనంలో కోర్టుకు తరలిస్తుండగా వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోకాస్తా వైరల్ అయ్యింది. పోలీసు వాహనంలోనే వీడియో తీయడం, దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం చర్చనీయాంశమైంది. ఓ కేసులో నిందితుడిగా ఉన్నవ్యక్తిని పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో కోర్టుకు తీసుకెళ్లే సమయంలో నిందితుడు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. నిందితుడిని కలవడానికి వచ్చిన వ్యక్తులు రీల్స్ తీసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 13న సోహేల్ అనే నిందితుడిని హత్యాయత్నం చేసులో పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో సోహేల్ కు చెందిన వ్యక్తులు వీడియో తీసినట్లుగా భావిస్తున్నారు.
