. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా లో ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలని పూర్తిగా తగ్గించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాల పై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జ్ ను పెంచుకుంటూ వైద్య సేవలను అందించాలని, దినేస్త్రీలో, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను క్రమం తప్పకుండా వారి ఇంటి వద్ద ఫాలో అప్ చేయాలని అన్నారు. సిపిఆర్ పట్ల అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి గర్భిణీ స్త్రీకి, ప్రతి బాలింతకి ఫాలోఅప్ విజిట్స్ లో తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలన్నారు. వేరే ప్రాంతాల నుండి తల్లి ఇంటికి వచ్చిన మన వద్ద నుండి వేరే ప్రాంతానికి వెళ్లిన మదర్ ఇన్, మదర్ ఔట్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. తద్వారా ఫాలోఅప్ సక్రమంగా నిర్వహించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని తెలిపారు. ప్రధమ చికిత్స కిట్టును, ఎమర్జెన్సీ కిట్టును అందరివద్దా అందుబాటులో ఉంచుకోవాలని, బిడ్డకు బిడ్డకు మధ్య వ్యత్యాసం పాటించేలా అవగాహన కలిగించాలని, శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కౌన్సిలింగ్ చేసి అంతరా, ఐయుడి పిపీఐయుసిడి వాడేలా చూడాలన్నారు. అంతిమంగా మన చేతిలో ఉండి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా కాపాడదగ్గ ప్రాణాలు అన్నిటిని కాపాడే బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నవీన్ మాట్లాడుతూ అనుబంధ ఆహారంపై, తల్లిపాలపై, చెవిలో ముక్కులో నూనె వేయడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు సరిపడా నిద్రపోకపోయినా, పాలు త్రాగకపోయినా, మూత్రం చేయకపోయినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ నిషాద్, అశ్విని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సీబీపీ, హిమగ్లోబిన్, బిపి రికార్డు హైట్, వెయిట్ ఎప్పటికప్పుడు పరీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ఎం అశోక్, వైద్య నిపుణురాలు డాక్టర్ నిశాత్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరీష్ కుమార్, అనస్థటిస్ట్ డాక్టర్ సుజయ్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ లు డాక్టర్ అశ్విని, డాక్టర్ సమత, పిఓఎంసిహెచ్ డాక్టర్ శ్వేత, సిడిపిఓలు జానకి, జ్యోతి, రాంబాబు, డిహెచ్ఈలు గన్పూర్ వెంకటేశ్వర్లు, మనోహర్ వివిధ పీహెచ్ సీల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

