జాతీయ రహదారిపై నిబంధనలకు తిలోదకాలు

0 2,069

. . . 4 టన్నుల గోదాములు లేకున్నా ధాన్యం  కేటాయింపు

. . .  ఉనుక కోసం కోసం ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు

బతుకమ్మ, నిజామాబాద్ : 

నిజామాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్న రైస్ మిల్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిపై నెలకొల్పిన  రైస్ మిల్ ఎలాంటి నియమనిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ అవేమి  పట్టించుకోకుండానే  ధాన్యం కేటాయించడం ఆందోళన కలిగిస్తుంది.  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి శివారులో జాతీయ రహదారిపై  ఉన్న రైసుమిల్లుతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రైసుమిల్లును నిర్మించిన ఇప్పటి వరకు గోదాములు నిర్మాణం  ఊసులేదు. నాలుగు టన్నుల సామర్థ్యం కలిగిన మిల్లుగా రికార్డులలో నమోదు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో గోదాములు మాత్రం  నిర్మించలేదు. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మిల్లు ప్రక్కనే బహిరంగ ప్రదేశంలో ఉంచి మరఆడిస్తున్నారు. అకాల వర్షాలు కానీ మరేదైనా ప్రమాదం సంభవిస్తే ధాన్యానికి పూచికత్తు లేకుండాపోతుంది. సంబంధిత మిల్లులో మరఆడించే సమయంలో వెలువడే దుమ్ము, దూళితో స్థానిక గ్రామ ప్రజలకు ఇబ్బందలు తప్పడం లేదు. ధాన్యం మరఆడించేటప్పుడు వెలువడే వ్యర్థాలు (ఉనక పొట్టు) ను నిల్వ చేయడానికి గోదాము లాంటి ఏర్పాట్లు లేకపోవడంతో జాతీయ రహదారి వెంట వెళ్లే వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా సంబంధిత ఉనుక పొట్టు వాహనదారుల కళ్ళలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రైసుమిల్లు  నిర్మాణంలో ఎలాంటి  నియమనిబంధనలు పాటించకపోయినా జాతీయ హైవే అథారిటీ  అధికారులు కానీ  స్థానిక అధికార యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం గమనార్హం.

Recommendations for rules on national highways

Leave A Reply

Your email address will not be published.