బిచ్కుంద సీఐగా రవికుమార్

0 14,541

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిఐగా విధులు నిర్వహిస్తున్న జగడం నరేష్ ను ఐజి కార్యాలయానికి అటాచ్ చేయడంతో ఆయన స్థానంలో హైదరాబాదులో ఇంటిగ్రేటెడ్ కమాండ్  కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న రవికుమార్ను నియమించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా గుట్కా, మట్కా, పేకాటకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయనకు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.