. లాప్రోస్కోపితో చెడిపోయిన కిడ్ని తొలగింపు
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో ఓ మహిళకు లాప్రోస్కోపి ద్వారా అరుదైన శస్ర్త చికిత్స చేసినట్లు ప్రముఖ యురాలజిస్ట్, ఎండ్రాలజిస్ట్, లేజర్ సర్జన్ ఏ సతీశ్ తెలిపారు. ఆస్పత్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని ఆటోనగర్ కు చెందిన 28 ఏళ్ల మహిళ యాస్మిన్ బేగం తీవ్ర నడుమునొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఆస్పత్రికి రాగా, వైద్య పరీక్షల అనంతరం కిడ్నీల పనితీరుపై హైదరాబాద్ లో టెస్టులు చేయించగా కుడివైపు కిడ్ని పని చేయడం లేదని రిపోర్టు వచ్చిందన్నారు. ఓపెన్ ఆపరేషన్, కుట్లు లేకుండా ల్యాప్రోస్కోపి ద్వారా కిడ్నిని తొలగించామన్నారు. ప్రస్తుతం యాస్మిన్ బేగం ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ సతీశ్ తెలిపారు. ఒక్క కిడ్నీతోనూ మనిషి ఆరోగ్యంగా జీవించొచ్చని తెలిపారు. ల్యాప్రోస్కోపి ద్వారా కిడ్నిని తొలగించడం నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి అన్నారు. విలేకరుల సమావేశంలో మత్తు వైద్యులు వను, ఆస్పత్రి ఇన్ చార్జి స్వామి, డీఏంఎస్ యజ్ఞ,మార్కెటింగ్ హెడ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
