మెడికవర్ లో అరుదైన శస్త్రచికిత్స
. లాప్రోస్కోపితో చెడిపోయిన కిడ్ని తొలగింపు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో ఓ మహిళకు లాప్రోస్కోపి ద్వారా అరుదైన శస్ర్త చికిత్స చేసినట్లు ప్రముఖ యురాలజిస్ట్, ఎండ్రాలజిస్ట్, లేజర్ సర్జన్ ఏ సతీశ్ తెలిపారు. ఆస్పత్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని ఆటోనగర్ కు చెందిన 28 ఏళ్ల మహిళ యాస్మిన్ బేగం తీవ్ర నడుమునొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఆస్పత్రికి రాగా, వైద్య పరీక్షల అనంతరం కిడ్నీల పనితీరుపై హైదరాబాద్ లో టెస్టులు చేయించగా కుడివైపు కిడ్ని ...