. . . అంబేద్కర్ సంఘ నాయకులు
మాచారెడ్డి, బతుకమ్మ :
పల్లె రమేష్ గౌడ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తామని అంబేద్కర్ సంఘం నాయకులు హెచ్చరించారు. ఏప్రిల్ 14న పరిధిపేట గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పల్లె రమేష్ గౌడ్ అంబేద్కర్ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ సంఘాలు అడుక్కుతింటున్నాయి, బిచ్చమెత్తుకుంటున్నాయి అంటూ అహంకారపూరితంగా మాట్లాడటంపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై ఇప్పటికే ఏఎస్పీ చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. రమేష్ గౌడ్ వైఖరిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి, అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా అధ్యక్షులు సంగి రాజలింగం, జిల్లా అధ్యక్షులు కొత్తోల్ల గంగారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తి లక్ష్మి, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
