యాసంగికి డోకా లేదని ఆయకట్టు రైతుల్లో ఆనందం
బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకొని నిండుకుండల తోనికి సలాడుతుంది. వర్ణుడు రైతుల ఆశలను వమ్ము చేయకుండా వారం రోజులపాటు కురిసిన వర్షాలకు జలాశయం సెప్టెంబర్ నెలలో భారీ వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొంది. ప్రాజెక్ట్ ఆయకట్ట రైతులకు ఖరీఫ్ పంటలకు నిరంధించిన ఎస్సారెస్పీ యాసంగి (రబీ) పంటలకు కూడా నీరందించడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఆయకట్ట రైతులు రెండు పంటలుసమృద్ధిగా పండుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు :
జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం వరకు 247.870 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి లో 80.501 టిఎంసిల నీటిని నిలువ చేయగా మిగతా 174.769 టీఎంసీల నీటిని మిగులు జలాలుగా విడుదల చేశారు.
ప్రాజెక్టు నుండి వదిలిన నీరు
వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 96 టీఎంసీలు, కాకతీయ కాలువ ద్వారా 27 టీఎంసీలు, వరద కాలువ ద్వారా 35 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.7 టిఎంసిలు, లక్ష్మీ కాలువ ద్వారా 0.5 టిఎంసిలు, మిషన్ భగీరథకు 2.70 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 టీఎంసీలు, ఆవిరి రూపంలో 0.4 టిఎంసిలు వెళ్లిపోయాయి.
పంటలకు నీరు
వానాకాలం పంటలకు ఆగస్టు ఏడవ తేదీ నుంచి నీటి విడుదల చేశారు. మొత్తం 7.56 లక్షల ఎకరాల నీరు అందిస్తున్నారు.
రబీ పంటలకు రామయ్య అండ
