- తప్పిదాన్ని కప్పిపుచుకొనేందుకు ముదిరాజ్ ల తప్పుడు ఫిర్యాదు
- గ్రామస్థుల మనోభావాలు దెబ్బతిని వీడీసీ రద్దుకు నిర్ణయం
వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ని గ్రామస్థులు సోమవారం రద్దు చేశారు. ఈ మేరకు గ్రామకమిటీ భవనానికి తాళం వేశారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్, ఎస్సైలకు వివరిస్తూ వినతి పత్రాన్ని గ్రామస్థులు అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా గ్రామంలోని 350 సర్వే నెంబర్ లోని 5 ఎకరాల 30 గుంట అస్సేన్డ్ భూమికి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించారని, ఈ భూమి మాదేనని అనడం తో గ్రామంలోని 24 కులాల వారు హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. హైకోర్టు లో ముదిరాజ్ కులస్థులు లేని కుల బహిష్కరణ ఉన్నట్లు మా 24 కులాల వారిపై ఫిర్యాదు చేసారని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశానుసారం ఏ సీ పీ, సీ ఐ ఇతర అధికారులు కుల బహిష్కరణ లేదని కేసు కొట్టివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాకు కొత్తగా జడ్జీ రావడం తో మళ్ళీ కుల బహిష్కరణ అని తప్పుడు ఫిర్యాదు చేయగా జడ్జీ వీడీసీ కి చట్ట బద్దత లేదని, వీడీసీ ని రద్దు చేయాలని తెలపగా ఆ విషయాన్నీ 24 కుల సంఘాల సభ్యులతో చర్చించి వీడీసీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వినతి లో వెల్లడించారు. తప్పు చేసిన వీడీసీ కోవలో తప్పు చేయని రామన్నపేట్ గ్రామ కమిటీని పదే పదే రద్దు చేయాలనే మాట రావడం తో గ్రామస్థులకు మనోభావాలు దెబ్బ తిన్నాయని అందుకే జడ్జ్ మాటను గౌరవించి వీడీసీని రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు విషయంలో మండల, డివిజన్, జిల్లా అధికారులు చెప్పిన విధంగా నడుచుకున్నామని వివరించారు.
