రామన్నపేట వీడీసీ రద్దు
తప్పిదాన్ని కప్పిపుచుకొనేందుకు ముదిరాజ్ ల తప్పుడు ఫిర్యాదు గ్రామస్థుల మనోభావాలు దెబ్బతిని వీడీసీ రద్దుకు నిర్ణయం వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ని గ్రామస్థులు సోమవారం రద్దు చేశారు. ఈ మేరకు గ్రామకమిటీ భవనానికి తాళం వేశారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్, ఎస్సైలకు వివరిస్తూ వినతి పత్రాన్ని గ్రామస్థులు అందజేశారు. గత మూడు సంవత్సరాలుగా గ్రామంలోని 350 సర్వే నెంబర్ లోని 5 ఎకరాల 30 గుంట అస్సేన్డ్ భూమికి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు...