26.2 C
Hyderabad

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బాన్సువాడ పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలేఖ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఐటి సాంకేతిక రంగానికి విశేష కృషి ఫలితంగా నేడు దేశంలో ఐటి సాంకేతిక రంగం ఉరకలు వేస్తుంది అని దీనికి రాజీవ్ గాంధీ ముందు చూపు చొరవ పట్టుదల అంకిత భావం కారణం అన్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలేఖ్,జిల్లా యూత్ అధ్యక్షులు మధు సుధన్,నాయకులు మాజీ ఎంపిపి ఏజాస్, నార్ల రవీందర్,గోపాల్ రెడ్డి,నార్ల సురేష్,అజీమ్,శహబ్,గౌస్,ఇలియాస్, హకీమ్,రాజు,షోయెబ్,అతిక్ అందే రాజు పాల్గొన్నారు.

 

More articles

Latest article