26.2 C
Hyderabad
Monday, August 3, 2026

 కామారెడ్డి జిల్లాను ముంచేత్తిన వాన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దశాబ్ధాల రికార్డులు బద్ధలుకోట్టిన వర్షం

. . . పోంగిపోర్లిన వాగులు, వంకలు

. . . కోట్టుకుపోయిన రైల్వే ట్రాక్… రైళ్ల రాకపోకల బంద్

. . .  హైవేల పై నుంచి ప్రవహించిన వరధ.. రాకపోకల నిలిపివేత

.. . .జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలో పలు కాలనీలు

. . . వరధల్లో చిక్కుకున్న పలువురిని కాపాడాన ఎస్ డిఆర్ఎఫ్

. . . పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 కామారెడ్డి , బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాను బారీ వాన ముంచేత్తింది. మంగళవారం ప్రారంభమైన వర్షం బుదవారం మధ్యహ్నం వరకు కుడా దంచి కోట్టింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా రాజంపేట్ మండలం ఆర్గోండలో 363.8 మిల్లీమీటర్లు, భిక్నూర్ 238.0 ,పాత రాజం పేట 215.3లలొ అత్యధిక వర్షపాతం నమోదయింది.మాచారెడ్డి మండలం లచ్చపేట190.0 మిల్లీమీటర్లు, ఐడిఓసి (కామారెడ్డి)180.5 , తాడ్వాయి మండలంలో157.8, ఏల్పుగొండ154.8, లింగంపేట్ లో108.8, బీబీపేట్105.5, సదా శివ నగర్ లో 100.8, ఇసాయి పేటలో 99.5, నాగిరెడ్డిపేటలో 97.3, గాందారీ సర్వాపూర్ లో 77.5, రామలక్ష్మణ పల్లేలో 75.3, నిజాం సాగర్ హసన్ పల్లిలో 73.5, మహ్మద్ నగర్ మండలం ముక్ధంపూర్ లో 58.5  గాందారీలో 34.0, ఎల్లారెడ్డి మాచాపూర్ లో 30, పిట్లంలో 26, రామారెడ్డి లో19.5వర్షం కురిసింది. కుండపోత వానతో జన జీవనం అస్థవ్యస్థమైంది. రాజంపేట్ మండలంలో రికార్డు స్థాయిలో వర్షం కురువడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

Rain inundates Kamareddy district

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ జంగంపల్లి వద్ధ జాతీయ రహదారిపై నుంచి వరధ పోంగిపోరిలింది. దానితో ఇరువైపులకిలో మీటర్ల మేరకు వాహనాలు నిలిపివేశారు అధికారులు. తాత్కలికంగా జాతీయ రహదారిని మూసివేశారు.  బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి –తడకమడ్ల మద్య నిజామాబాద్- హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తు ధక్షిణ మద్య రైల్వే అధికారులు ప్రకటన జారీ చేశారు. కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీని వరధ ముంచేత్తింది.తమను కాపాడాలంటు స్థానికులు అర్థనాధాలు చేశారు. పాల్వంచ బ్రీడ్జీ పై నుంచి వాగు పోంగిపొర్లుతుంది పాల్వంచ వాగు బ్రిడ్జీ పై నుండి వాటర్ పోతున్న నేపథ్యంలో కామారెడ్డి కి రాక పోకలు బంద్ చేశారు అధికారులు. కామారెడ్డి – నిజాంసాగర్ ప్రధాన రహదారి కొట్టాల్ దగ్గర వంతెన కూలిపోయింది. కామారెడ్డి పోయేవారు ప్రయాణాలను విరమించుకోవాలని అధికారులు సూచనలు చేశారు.

Rain inundates Kamareddy district

కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ముడు కార్లు కోట్టుకుపోయాయి. కాలనీలో చిక్కుకున్న స్థానికులకు పట్టణ సిఐ నరహరి అధ్వర్యంలో నీటినుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. దానితో నిజాం సాగర్ మండలం అన్నాసాగర్ బోగ్గు గుడిసే వద్ధ నూతన బ్రిడ్జీ కట్టాడాదల వద్ధ సుమారు 9 మంది బిహారీ కార్మీకులు చిక్కుకుపోయారు. డిసీయం  వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి తమను కాపాడాలని సహయక చర్యలకోసం కేకలు వేశారు. అధికారులు వెంటనే స్పంధించి ఎస్ డిఆర్ఎప్ టింను రప్పించి 9 మందిని కాపాడారు.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ వసతి  వరదలో చిక్కుకుపోయిన విద్యార్థులను స్థానికులు రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద నీళ్ళు రావడంతో నీటమునిగిన నాగిరెడ్డిపేట్‌లోని బాయ్స్ హాస్టల్.ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి పౌల్ట్రీ ఫామ్ లో చిక్కుకున్న వరద బాధితులను రిస్క్ టీమ్ కాపాడింది. సంగమేశ్వర వద్ధ దోమకొండ  వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.

Rain inundates Kamareddy district

కామారెడ్డి జిల్లాలో బారీ వర్షం నేపథ్యంలో సహయక చర్యలను సీయం రేవంత్ రెడ్డి పోన్ ద్వార అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షీత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కామారెడ్డి జల్లా కేంద్రంలో బారీ వర్షాల నేపథ్యంలో జలమయమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు పరిశీలించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ హవేలీ ఘనపూర్ వద్ద వరద ఉద్రితిని ఎల్లారెడ్డి ఆర్డిఓ, డిఎస్పీ శ్రీనివాస్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావుతో పాటు బాన్సువాడ సబ్ కలెక్టర్ హీరణ్మయిలు సహయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిల్లా ప్రజలను వరదల సమయంలో  ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, రాష్ట్రస్థాయి నుండి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడ్డ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468-220069  సమాచారం అందించాలని  లేదా సమీప అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.  అధికారులు కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండి ఈ భారీ వర్షం సమయంలో ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. లో లెవెల్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి   పునరావస్వం కల్పించాలని జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ తెలిపారు.

More articles

Latest article