29 C
Hyderabad
Monday, August 3, 2026

రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

 ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య లు మాట్లాడారు,రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు శనివారం మండల కేంద్రంలో దిష్టిబొమ్మను దహనం చేయడం అవివేకమైన చర్యగా ఖండించారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ భావి భారత ప్రధానమంత్రిగా కావడం ఖాయం అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఓటు చోర్ కార్యక్రమాన్ని బీహార్లో పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడం పట్ల కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం పట్ల అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం, వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,నాయకులు చెన్ని బాబు, చెరుకు ఎల్లయ్య,పందిర్ల శ్రీనివాస్,మెండే శ్రీనివాస్, సురేందర్,గోపాల్, బండారి బాల్ రెడ్డి,కల్లూరు బాపురెడ్డి,గంట బుచ్చగౌడ్,వంగ మల్లారెడ్డి,నంది కిషన్,మహేందర్, పొన్నాల మల్లారెడ్డి,పడిగల రవీందర్, సూడిద రాజేందర్, గంగయ్య, లక్ష్మణ్,శ్రీనివాస్,లాల్ మొహమ్మద్, కంచర్ల రాజు, తిరుపతి గౌడ్,గుర్రం రాములు,గంట అంజయ్య,గోపాల్, ఎల్లా గౌడ్,బీపేట రాజు, కిషన్, మూర్తి వెంకటేష్,దేవయ్య, ముక్క శంకర్, మల్లేశం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article