రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం

 ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య లు మాట్లాడారు,రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు శనివారం మండల కేంద్రంలో దిష్టిబొమ్మను దహనం చేయడం అవివేకమైన చర్యగా ఖండించారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ భావి భారత ప్రధానమంత్రిగా కావడం ఖాయం అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు....