27.2 C
Hyderabad

1104 యూనియన్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రఘువీర్ అశోక్

Raghuveer and Ashok appointed as President and Secretary of the 1104 Union, Nizamabad Division

Must read

📰 Generate e-Paper Clip

 

 ఇందూర్, బతుకమ్మ:

విద్యుత్ శాఖ కు సంబందించిన 1104 యూనియన్ నిజామాబాద్ డివిజన్ ఎన్నికలు హోరా హోరిగా సాగాయి. పోటీదారులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో నాయకులు రఘునందన్, రాజేందర్ గౌడ్ ఎన్నికలు జరిపించారు. ఏకగ్రీవం చేద్దామని పోటీదారులను బుజ్జగించిన, ససేమిరా అనడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి,  పోటీలో నిలబడే వారి నుంచి నామినేషన్లు స్వీకరించారు. డివిజన్ అధ్యక్ష పదవికి రఘురాజ్, సాయినాథ్ రెడ్డి పోటీలో నిలిచారు. మొత్తం 184 ఓట్లు పోలవగా 133 ఓట్ల తో రఘువీర్ అధ్యక్షునిగా గెలుపొందాడు. కార్యదర్శి గా అశోక్, ఖాశిం బాబు పోటీలో ఉండగా 100 ఓట్లతో అశోక్ విజయం సాధించాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురు బరిలో నిలవగా, ప్రవీణ్ 77 ఓట్లు సాధించి గెలుపొందాడు. ఇందులో ఇద్దరు ఏఎల్ఎంలు కమలాకర్, సుంకరి నాగన్న కాగా, లైన్ మెన్ ప్రవీణ్ ఉన్నాడు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఇద్దరు పోటీ చేయగా, ప్రశాంత్ కు 74 ఓట్లు రాగా, పఠాన్ 110 ఓట్లు సాధించి విజయం సాధించాడు. పోటాపోటి జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారిని రఘునందన్, రాజేందర్ గౌడ్, లింగం, నరేందర్ నాయక్ అభినందించారు.

More articles

Latest article