జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన రాచర్ల గొల్లపల్లి విద్యార్థులు

0 14,783

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వారధి ఫౌండేషన్ వారు ఇంగ్లీష్ సబ్జెక్టులో మండల స్థాయిలో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్ నిర్వహించారు. కాంపిటీషన్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి విద్యార్థులు ఎస్సే రైటింగ్ లో ఎల్. త్రిపుర, డి. చేతన, డిబేట్ కాంపిటీషన్లో వి. సాయి సహస్ర, జి .త్రివేన్ రెడ్డి ,ఎం. సహస్ర మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మురళీధర్,ఉపాధ్యాయ బృందం అభినందించారు. జిల్లాస్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.