మోర్తాడ్, బతుమ్మ: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు. కిచెన్ షెడ్డు, శానిటేషన్, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు ఒడ్యాట్ గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను తప్పులేకుండా నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మోర్తాడ్ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ రంజిత్ కుమార్ తదితరులున్నారు.

