30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజా సంక్షేమానికి పెద్దపీట 

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ , బతుకమ్మ  : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బాన్సువాడ మున్సిపల్ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు, వీధి వ్యాపారులకు బ్యాంక్ రుణ చెక్కులను పంపిణీ చేశారు. మహిళా శక్తి క్యాంటీన్ లో స్థానిక నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నార్ల సురేష్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article