26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 12వ డివిజన్ లో పర్యటించిన నగర మేయర్ ఉమారాణి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నగర మేయర్ ఉమారాణి అన్నారు. నగరంలోని 12వ డివిజన్ లో  నగర మేయర్ ఉమారాణి రమేష్ నగర  మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి సరఫరా రోడ్ల సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న లోపాలు, తాగునీటి సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన మేయర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ లు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం, పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన నగర నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని, వాటి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా నగర పాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. మేయర్ వెంట 12వ డివిజన్ ఇంచార్జ్ ఆదిత్య పాటిల్, ఏఈ ఇనాయత్ కరీం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సోలోమన్ రాజ్, మున్సిపల్ జవాన్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Public participation is crucial for the development of the city.
Public participation is crucial for the development of the city.

More articles

Latest article