మోర్తాడ్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లి గ్రామపంచాయతి సర్పంచ్ పెగడ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఆవరణలోని చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను, పచ్చి గడ్డి తొలగించి చీపుర్లతో తీసివేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరాం, వార్డు సభ్యులు సాయన్న, గణేష్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

