బతుకమ్మ, ఏర్గట్ల: 2025 సంవత్సరానికి పి ఆర్ టి యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాలలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,కిషన్,మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు , పదోన్నతులపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించడం జరిగిందని త్వరలోనే ఉపాధ్యాయులు కోరుకునే విధంగా ఆదేశాలు జారీ అవుతాయని తెలిపారు. ప్రత్యేక అంశం ఐన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపిఎస్ కి సంబంధించి క్యాబినెట్ కమిటీ తో చర్చించడం జరిగిందని ఫైల్ ఫైనాన్స్ సెక్రటరీ రాయ రవి దగ్గర ఉందని త్వరలోనే వారు కోరుకున్న విధంగా న్యాయం జరుగుతుందని, అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వ మానిఫెస్టో లో పెట్టిన సిపిఎస్ రద్దు పిఆర్ టియు బాధ్యత అని పూర్తి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల విధముగా జడ్పీ జిపిఎఫ్ కి సంబంధించిన బడ్జెట్ మరియు పోయిన నెల ఈనెల కలిపి 1200 కోట్ల రిలీజ్ కానుందని, పిఆర్ టియు అందరినీ కలుపుకొని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పెద్ద సంఘం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల అధ్యక్షులు బి కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జి రాజశేఖర్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దశందర్,గటాడి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, మండల అసోసియేట్ అధ్యక్షులు మైసాల సుధాకర్ ,మండల కార్యదర్శి ఇమాముద్దీన్, మహిళా ఉపాధ్యక్షురాలు మమత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.