23.2 C
Hyderabad

ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  జిల్లాలోని ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్, కూల్ వాటర్ బాటిల్స్ ను సీపీ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య అందజేశారు. రవీంద్ర ఫార్మసీ మెడికల్ ఏజెన్సీ వారి సౌజన్యంతో ఇవి అందించారు. దుమ్ము ధూళి నుంచి రక్షణగా కూలింగ్ గ్లాసెస్ పని చేస్తాయని, ఎండల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీపీ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్, రవీంద్ర ఫార్మసీ అధ్యక్షులు మధుసూదన్, జనరల్ సెక్రటరీ సుధాకర్, ట్రెజరర్ సాయిలు, ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article